కేజ్రీవాల్ ఆరోపణలు అవాస్తవం ఆధారాలతో తిప్పికొడుతాం : ఖుర్షీద్
ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్ ఖుర్శిద్ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద సంస్థ నిధులను దుర్వినియోగం చేసిం దని అరవింద్ చేసిన ఆరోపణలకు రుజువు లతో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఉదయం ఇందిరా గాంధీ విమానాశ్రయం లో ఆయన దిగగానే ఐఏసీ కర్యాకర్తలు నల్లజెండాలు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ నిధుల దుర్వినియోగం తదితర కార్యకలాపాలకు వీరిద్దరు పాల్పడ్డారని ఐఏసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. విమానాశ్రయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తాను తగిన సాక్ష్యాధారాలతో ఈ ఆరోపణలను తిప్పి కోడుతానని మంత్రి చెప్పారు.