కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ : ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగి అరెస్టయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. స్వచ్ఛంద సంస్థలో నిధుల అవకతవకలకు పాల్పడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాజీనాయా చేసేంతవరకూ పార్లమెంట్ వీధుల్లో నిరసన కొనసాగిస్తామని విడుదలైన అనంతరం కేజ్రీవాల్ హెచ్చరించారు. కేజ్రీవాల్‌తోపాటు పలువురిని అరెస్ట్ చేసి బవానాలోని రాజీవ్‌గాంధీ స్టేడియంలోకి నిన్న సాయంత్రం తరలించారు. ఈ మధ్యాహ్నం కేజ్రీవాల్ ఆయన మద్దతుదారులను విడుదల చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు.