కేటీఆర్‌కు లంక సర్కారు ఆహ్వానం

3

హైదరాబాద్‌,జులై 18(జనంసాక్షి): తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం అందించింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్‌ క్యాపిటల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పలికింది. దేశ విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగాలకు యువత సంసిద్ధం అంశాలపై శ్రీలంక ప్రధాని విక్రమ సింఘేతో పాటు కేటీఆర్‌ ఈ సమ్మిట్‌లో కీలక ఉపన్యాసం చేయనున్నారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలను శ్రీలంకలో వివరిస్తానని స్పష్టం చేశారు.  మూడు అంశాలపై ప్రసంగించాలని కేటీఆర్‌ను శ్రీలంక ప్రభుత్వం కోరింది. దేశ విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగాలకు యువత సంసిద్ధం అంశాలపై కేటీఆర్‌ ప్రసంగం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్య కార్యక్రమాలపై వివరిస్తానని కేటీఆర్‌ తెలిపారు.