కేతకి, ఏడుపాయల్లో ప్రత్యేక ఏర్పాట్లు
మెదక్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): మెదక్ జిల్లాలో ప్రధాన వైవాలయాల్లో శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడుపాయల, కేతకి తదితర ప్రధాన ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు . ‘ఏడుపాయల జాతర’కు తెలంగాణలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే అరుదైన ప్రదేశంలో సహజ ప్రకృతి అందాల మధ్య ఇది జరుగుతుండటం విశేషం. బండ్ల వూరేగింపు, బోనాల వేడుకలతో సంస్కృతిని, సంప్రదాయాలను చాటుతుండటంతో పాటు పర్యాటక వికాసానికి జాతర ఎంతగానో దోహదపడుతోంది. మంజీరా నది పాయ ఒడ్డున వెలిసి చారిత్రక మణిదీపంగా వెలుగొందుతున్న వనదుర్గామాత ఆలయ సన్నిధిలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే ఏడుపాయల జాతర జరుగుతుంది. కొండల మధ్య కొలువుదీరిన వనదుర్గామాతను దర్శించుకొని భక్తితో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. దీంతో చాలా మంది సకుటుంబ సమేతంగా ఇక్కడికి తరలివస్తారు. మంజీరా నదిలో పవిత్ర స్నానాలు చేసి దుర్గామాతను భక్తితో కొలుస్తారు. బోనాలు తీసి.. ఒడిబియ్యం పోసి.. తొ/-టటెలలు కట్టి.. మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా జరిగే ఏడుపాయల జాతరకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏడుపాయల్లో వనదుర్గామాత ఆలయంతో పాటు ముత్యాలమ్మ గుడి, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, పరుశరాముడి మందిరం, మునిపుట్ట,
గంగమ్మ ఆలయం, దర్గాలు ఉన్నాయి.
ఏడుపాయల ఆధ్యాత్మిక కేంద్రమే కాదు.. ప్రకృతి ప్రియులను అమితంగా ఆకట్టుకునే ఆహ్లాదకర ప్రదేశం.
పాపన్నపేట మండలం నాగ్సానిపల్లి సవిూపంలో ఏడుపాయల వనదుర్గామాత పుణ్యక్షేత్రం ఉంది. ఇక
శైవ క్షేత్రాల్లో ఒకటైన ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి నవాహ్నిక బ్ర¬త్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం శివరాతీ/-రి సందర్బంగా వేలాదిమంది భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సంగమేశ్వరుణ్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం వెనుక ఉన్న అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఆలయ అర్చకులు ఉదయమే స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన చేపట్టారు.