కేబినెట్‌ ఫైళ్లను ఎత్తుకెళ్లారు

1

– కేజ్రీవాల్‌ ఫైర్‌

ఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): సీబీఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్‌ విూటింగ్‌కు సంబంధించిన దస్త్రాలను సైతం సీజ్‌ చేశారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం

ఆరోపించారు.సీబీఐ అధికారులు తన కార్యాలయంలో సోదాలు జరిపి… సీబీఐ కేసుతో సంబంధంలేని డాక్యుమెంట్లను సీజ్‌ చేశారన్నారు. దిల్లీ క్రికెట్‌ సంఘానికి చెందిన ఓ దస్త్రం కోసం వెతికారని, ఆ సంఘానికి గతంలో అరుణ్‌జైట్లీ అధ్యక్షునిగా ఉన్నారని కేజీవ్రాల్‌ పేర్కొన్నారు. దానిని సీబీఐ అధికారులు చదివి, అంతలో విూడియా అక్కడికి రావడంతో దానిని వదిలేసి వెళ్లారన్నారు. ఒకవేళ ఆ దస్త్రానికి సంబంధించి ఏదైనా కాపీ తీసుకొని కూడా వెళ్లి ఉండవచ్చని కేజీవ్రాల్‌ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి అరుణ్‌జైట్లీపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. డీడీసీఏ ఫైల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ సీజ్‌ చేసిందన్నారు. సీబీఐ తమకు

అవసరం లేనటువంటి ఫైళ్లను ఎందుకు స్వాధీనం చేసుకుందని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ నిర్వహించిన దాడులతో కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం డీడీసీఏ పనితీరుపై దర్యాప్తు జరుపుతుండటం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి భయం కలిగిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. అరుణ్‌ జైట్లీ  రాజ్యసభలో సీబీఐ దాడులపై చేసిన ప్రకటన, సభను తప్పుదోవ పట్టించేలా ఉందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాజేంద్ర కుమార్‌ ఆఫీస్‌పై జరిగిన దాడులు కేవలం తనను లక్ష్యంగా చేసుకొనే జరిగాయని అన్నారు. ఇదిలా వుంటే సిబిఐ దాడులు ముమ్మాటికీ తప్పే మాజీ కేంద్ర

మంత్రి శతృఘ్ను సిన్హా అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కార్యాలయంపై సీబీఐ దాడులు చేయడాన్ని తప్పుపట్టారు. సీబీఐ సోదాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. దాడులు చేయాల్సిందిగా ఎవరు సలహా ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో టైమ్‌ చాలా ముఖ్యమని, దాడులు చేసేందుకు ఇది కచ్చితంగా తగిన సమయం కాదని చెప్పారు. కేజీవ్రాల్‌కు పాపులారిటీనే కాదు మాస్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువ అంటూ శత్రుఘ్న సిన్హా ప్రశంసించారు.కాగా సీబీఐ దాడుల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై కేజీవ్రాల్‌ వాడిన భాషను శత్రుఘ్న సిన్హా తప్పుపట్టారు. మోదీని పిరికిపంద, సైకో అంటూ కేజీవ్రాల్‌ నిందించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం ప్రిన్సిపల్‌ కార్యదర్శి  రాజేంద్ర కుమార్‌ ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో ఆప్‌, బీజేపీ నాయకుల మధ్య మాటలయుద్ధం  ముదిరింది. లాంటి సమయంలో అనుచిత విమర్శలు సరికాదన్నారు.