కేరళలో భారీ పేలుడు.. 

 

ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన

ఒకరు మృతి – 30 మంది తీవ్రంగాయలు

తిరువనంతపురం: : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో ఉన్న ఓ కన్వన్షన్‌ సెంటర్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం కాలామస్సేరి నెస్ట్‌ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో  క్రిస్టియన్‌ మతస్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో కన్వెన్షన్‌ హాల్‌ మధ్యలో ఒక్కరిగా భారీ పేలుడు జరిగింది. కాగా, ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రేయర్‌ మీట్‌ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వరపుజ, అంగమలి, ఎడపల్లి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా అక్కడున్నవారు భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు.ఇక, పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలు కాగా.. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తీవ్రమైన గాయాలతో వున్న క్షత్రగాత్రులను కొచ్చి మెడికల్ కాలేజీ నుంచి కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలిస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది.