కేరళలో వరద బీభత్సం

తిరువనంతపురం(జ‌నం సాక్షి): కేరళలో వరద బీభత్సం కారణంగా ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య 37కి చేరింది. ఈ నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 29 మంది వరకు మృత్యవాత పడగా, శనివారం మరో ఎనిమిది మృతిచెందినట్టు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కేరళలోని 14 జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో పెద్ద ఎత్తునా ఆస్తినష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతోంది.
లోతట్టు ప్రాంతాల్లోని 53వేల మందిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించగా, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అనుకూలించడంతో తిరిగి తమ ఇళ్లకు వచ్చేసారు. మిగిలిన 35, 874 మంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఆగస్టు 15 వరకు ఇడుక్కి, వేనాంద్ ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో అదేరోజు వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కన్నూర్ ప్రాంతాల్లో కూడా ఆగస్టు 13 (సోమవారం) వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.