కేరళ నుంచి హైదరాబాద్‌కు గుండె ప్రయాణం
హైదరాబాద్ నవంబర్28(జనంసాక్షి):
అరుదైన గుండె శస్త్ర చికిత్సకు హైదరాబాద్ వైద్యులు శ్రీకారం చుట్టారు. కేరళలోని తిరుచ్చిలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన యువకుడి గుండెను హైదరాబాద్‌లో యశోద ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న శ్రీనివాసరాజు(50) అనే వ్యక్తికి అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తిరుచ్చి నుంచి గుండెను తీసుకుని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బేగంపేట నుంచి సికింద్రాబాద్ యశోద వరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు.