కేరళ హైస్కూల్ లో జెండా పంపిణీ కార్యక్రమం
రుద్రంగి ఆగస్టు 10 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో గల కేరళ హైస్కూల్లో బుధవారం కరస్పాండెంట్ బాబు నంబియార్ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై విజయ్ కుమార్ హాజరైనారు. ఆయన చేతుల మీదుగా జాతీయ జెండా లను ప్రతి విద్యార్థికి అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లతిక ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.