కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది
– 22న మేనిఫెస్టోను విడుదల చేస్తాం
– టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ
హైదరాబాద్, అక్టోబర్17(జనంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుందని, అందుకే
తామిచ్చిన హావిూలనే కాపీకొట్టి టీఆర్‌ఎస్ మేనిఫెస్టో అంటూ ప్రకటించుకున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈసమావేశంలో మహాకూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడారు. కేసీఆర్ మైండ్ దొబ్బింది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను అధ్యక్షుడి స్థానం నుంచి తొలగిస్తేనే టీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్ అన్నారు. కేసీఆర్ ది ముదనష్టపు, ముండమోపి పాలన అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లలో ఖర్చుపెట్టిన 8లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని రమణ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కవిూషన్లు దండుకున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుంటే ఓట్లు వస్తాయనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. పాక్షిక మ్యానిఫెస్టో అనటమే కేసీఆర్ భయానికి సంకేతమని, కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. మేం ఇచ్చిన హావిూలనే కేసీఆర్ కాపీ కొట్టి ప్రకటించారని అన్నారు. నిరుద్యోగభృతి సాధ్యం కాదన్న కేసీఆర్ ఇప్పుడెందుకు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. ఈ నెల 22వ తేదీన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని