‘కేసీఆర్‌తో జరిపిన చర్చలను బయటపెట్టలేను’: మంత్రి వయలార్ రవి
ఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ ప్రాంత మంత్రులతో చర్చించిన విషయాలను తాను బయటపెట్టలేనని కేంద్ర మంత్రి వయలార్ రవి తెలియజేశారు. తెలంగాణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తనతో జరిపిన చర్చల విషయాలను వారు బయటపెడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు.