కేసీఆర్‌వి అహంకార రాజకీయాలు
– వరంగల్‌లో ఓడించండి
– జైపాల్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 3(జనంసాక్షి):
వరంగల్ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. హావిూల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మంగళవారం తెలంగాణ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.కేసీఆర్ క్యాసినో పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఎవరూ చేయనన్ని వాగ్దానాలు ఆయన చేశారని, రాజకీయాల్లో ఇన్ని హావిూలు ఇచ్చిన వారిని తాను చూడలేదని జైపాల్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు, రుణమాఫీ, పేదలకు ఇళ్లు విషయంలో హేతుబద్దత లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ అహంకారానికి ఈ ఉప ఎన్నిక అద్దం పడుతుందని వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడించాలని జయపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. అన్నారు. ఉప ఎన్నిక అవసరం ఎందుకు వచ్చిందో జనం గమనిస్తారని ఆయన అన్నారు. రాజకీయాలలో ఎవరూ చేయనన్ని వాగ్దానాలను కెసిఆర్ చేశారని, వాటిని అమలు చేయలేకపోతున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు.రిజర్వేషన్లు, రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం వంటి విషయాలలో ఒక హేతుబద్దత లేకుండా కెసిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు.