కేసీఆర్‌ నరుకుడు పోశెట్టి


మాటలే తప్ప చేతలు లేని నేత
మండిపడ్డ బిజెపి ఎంపి అర్వింద్‌
కరీంనగర్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కేసీఆర్‌ లాంటి నరుకుడు పోశెట్టి ప్రపంచంలోనే లేడని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాలు చెప్పి మాయచేసే రకమని అన్నారు. తెలంగాణలో అన్ని పథకాలూ అవినీతిమయమే అని ఆరోపించారు. తెలంగాణ క్యాబినెట్‌లో దళితులకు చోటు ఏది అని ప్రశ్నించారు. మోదీ కాళ్ళు కడిగి ఆ నీళ్లను కేసీఆర్‌ తల విూద చల్లుకోవాలని అన్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్‌పై పరుషపదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం లక్షా 70 వేల కోట్లు సంపాదించిందని తెలిపారు. 2023 లో విజయ్‌ మాల్య వెళ్లినట్టు కేటీఆర్‌, కవిత, సంతోష్‌, హరీశ్‌లు విదేశాలకు పారిపోతారని అన్నారు. కేసీఆర్‌కు రేవంత్‌ 2023 వరకు రెండో కొడుకు అని అన్నారు. గెలిచే కాడికి కొడుకుని, గెలవని కాడికి హరీష్‌ని పంపి బకరా చేస్తున్నారని దుయ్యబట్టారు. రోహింగ్యాలకి పాస్‌ పోర్ట్‌లు ఇవ్వడం అంటే టెర్రరిస్‌ట్లకు సహాయం చెయ్యడమే అని అన్నారు. కొంగ మెడ హరీష్‌ అబద్దాలు చెప్పడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. సోమేష్‌ కుమార్‌ పెద్ద దొంగ అని…. కేంద్రానికి అన్ని అబద్దాలు చెప్తున్నారని ఎంపీ అరవింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి హుజూరాబాద్‌లో బిజెపి బుద్ది చెప్పబోతున్నదని అన్నారు. ఎన్ని పథకాలు పెట్టినా పైసలు పంచినా ప్రజలు నమ్మరని అన్నారు.