కేసీఆర్‌ నాలుగుసార్లు వరంగల్‌ వచ్చి ఏం చేశారు : ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 29 : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు వరంగల్‌ నాలుగు సార్లు వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. అధికారులను ఇబ్బంది పెట్టడం తప్ప ఏం చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని సవాలు విసిరారు. కన్నతల్లి లాంటి టీడీపీపై విమర్శలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఏమనాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు.