కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు – ఎంపీ గుత్తా

నల్గొండ, కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. పండుగల పేరిట పబ్బం గడుపుతున్నారన్నారు. ఉద్యమాలతో నిర్మించిన టీఆర్‌ఎస్‌ ఉద్యమాలను అణచాలనుకోవడం దారుణమని ఎంపీ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమని ఎంపీ గుత్తా విమర్శించారు.