కేసీఆర్‌ దూరదృష్టితో అద్భుతంగా నీటిపారుదల

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి(జనంసాక్షి): తెలంగాణ నేల విూద పారే ప్రతి నీటిబొట్టును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నా మని,కేసీఆర్‌ నాయకత్వంలో ఎంతో దూరదృష్టితో నీటిపారుదల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. నేడు మంత్రులు కేటీఆర్‌ , ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగుల కమలాకర్‌ల వనపర్తి పర్యటన నేపథ్యంలో వనపర్తిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో వనపర్తి ప్రగతిపై రూపొందించిన వనపర్తి ప్రగతి ప్రస్థానం కాఫీ టేబుల్‌ బుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ‘‘ భవిష్యత్‌ లో వనపర్తికి తాగునీటి కొరత ఉండదు.అభివృద్ది పనుల ప్రారంభం లో రికార్డ్‌రూ.425 కోట్ల మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేశాం.ఒక్క పట్టణంలోనే 1500 పై చిలుకు డబల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి నిరుపేదలకు, రోడ్డు విస్తరణ బాధితులకు ఇవ్వడం జరిగందివనపర్తి ప్రజలు, ప్రభుత్వ, సాహితీవేత్తలు, ఇతరుల కార్యక్రమాల కోసం రూ.5.75 కోట్లతో సురవరం సాహితీ కళాభవనం (టౌన్‌ హాల్‌) నిర్మించడం జరి గింది.ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్‌ ను నిర్మిస్తాం. రూ.20 కోట్లతో సవిూకృత శాఖాహార, మాంసాహార, పండ్లు, పూల మార్కెట్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది.ఇందులో సూపర్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయబో తున్నాం.సురవరం ప్రతాపరెడ్డి పేరుతో నిర్మించిన గ్రంథాలయం ప్రారం భించుకోనున్నాం.నిరుద్యోగులు, యువత, విద్యార్థుల కు అందుబాటులో ప్రింట్‌ డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేశాం.విలువైన గ్రంథాలతో సురవరం గ్రం థాలయాన్ని తీర్చిదిద్దుతాం.రాష్ట్రానికి ఆదర్శంగా నిలు పుతాం.రూ.76 కోట్ల బైపాస్‌ రహదారి నిర్మాణానికి, రూ.48 కోట్ల పెబ్బేరు రహదారి నిర్మాణానికి రేపు శంకుస్థాపన రూ.22 కోట్లతో వనపర్తి రాజప్రాసాదం పునరుద్దరణ, శిథిలమైతున్న పాలిటెక్నిక్‌ హాస్టల్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన వనపర్తి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పనులకు శంకుస్థాపన, ప్రారంభంజిల్లాకేంద్రంతో పాటు చుట్టు పక్కల అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. భవిష్యత్‌ లో చిట్యాల, రాజనగరం విూదుగా మరో బైపాస్‌ రహదారిమొదటిదశలో సంకిరెడ్డిపల్లిలో రూ. 300 కోట్లతో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన నూతన పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా వేలాది మం దికి ఉపాది.óఏదుల రిజర్వాయర్‌ కడుతుంటే ఎగతాళి చేశారు .. రికార్డ్‌ సమయంలో దానిని పూర్తిచేశాంరేపు వనపర్తికి ఏదుల సాగునీటికి, తాగునీటికి వరప్రదా యిణిగా నిలవనున్నదన్నారు.’’ ఈ సమావేశంలో మార్కెట్‌ చైర్మన్‌ పలుస రమేష్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, జిల్లా గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు