కేసీఆర్ ని గద్దె దించాలి

కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు భూక్య గోపాల్ నాయక్

జనం సాక్షి,చెన్నారావుపేట

కేసీఆర్ ని గద్దె దించాలని, యువతి యువకులు కాంగ్రెస్ పార్టీకి  అండగా ఉండాలని, తెలంగాణ రాష్ర్టంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ మండల పార్టీ అద్యక్షులు భూక్య గోపాల్ నాయక్ అన్నారు. బాపునగర్ గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అద్యక్షులు బాధవత్ బాస్కర్, అమీనాబాద్ సర్పంచ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్,క్లస్టర్ బాద్యులు సిద్దేన రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ మండల అద్యక్షులు భూక్య గోపాల్ నాయక్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల ను గడప గడపకి వెళ్లి వివరించారు. మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల 2,500, 500రూ లకే గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,రైతు భరోసాగా 2 లక్షల రుణమాఫీ ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఏకరానికి 15,000రూ వ్యవసాయ కూలీలకు 12,000రూ,వరి పంటకు 500రూ బోనస్ గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్,ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు,ఉద్యమకారులకు 2500 గజాల ఇళ్ల స్థలం,యువ వికాసం క్రింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు,ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ 4000 నెలవారి పింఛన్,10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా,రైతులకు రెండు లక్షల రుణమాఫీ,నిరుద్యోగులకు ప్రతినెల 4 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ  పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మద యాకయ్య గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య,శంకరాంతండా గ్రామ సర్పంచ్ భద్రు నాయక్,మాజీ ఎంపీటీసీ బిళ్ళ ఇంద్రసేన రెడ్డి,మండల నాయకులు భూక్య మోహన్ నాయక్,యువజన కాంగ్రెస్ మండల అద్యక్షులు బండి హరీష్,పత్తినాయక్ తండా గ్రామ కాంగ్రెస్ అద్యక్షులు రవి నాయక్,హనుమ నాయక్,హంస బద్రయ్య, రాజేందర్, రాజా,బాలాజీ,కొర్ర లచ, బాలు,రవి,సాంక్రి, దేవేందర్,గ్రామ కాంగ్రెస్ నాయకులు,వార్డ్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.