కేసీఆర్ పై కేసు పెట్టిన మత్తయ్య

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ స్టీఫెన్ సన్ వద్ద రూ. కోటి తీసుకున్నాడని మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 506,507,387 సెక్షన్ల కింద కేసీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మత్తయ్య మాట్లాడుతూ… తెలంగాణ పోలీసుల నుండి తనకు ప్రాణ భయం ఉందని, నాలుగు రోజులుగా భార్య, పిల్లలను అక్రమంగా నిర్భంధించారని తెలిపారు.