కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకషంగా పరిశోధన చేయాలి :

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యెస్.పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతు.. గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు కోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్, కేసుల్లో శిక్షల శాతం పెంచాలి. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలి, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి చాలెంజిగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలి, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. సిసిటిఎన్ఎస్ లో డాటా ఎంట్రీ ప్రతిరోజూ మానిటర్ చేయాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. నాన్ బేయిలబుల్ వారెంట్ త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలి. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో గ్రామాల విపిఓలు పోలీస్ అధికారులు సిబ్బంది ప్రోయాక్టివ్ పోలీస్ సింగ్ విధులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే విది నిర్వహణలో ప్రతిభ కనపరచిన సిబ్బందిని అభినందించి శాలువా తో సత్కరించినారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు యెస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు, మెదక్ డి.ఎస్.పి శ్రీ.సైదులు గారు,ఏ.ఆర్.డి.ఎస్.పి శ్రీ.శ్రీనివాస్ గారు,ఆర్.ఐ.శ్రీ.నాగేశ్వర్ రావ్ గారు,ఎస్.బి.సి.ఐ.శ్రీ.నవీన్ బాబు గారు, డి.సి.ఆర్.బి. సి.ఐ.శ్రీ.రవీందర్ గారు, ఐ.టి.కోర్ ఎస్.ఐ.శ్రీ.సందీప్ రెడ్డి గారు జిల్లా సి.ఐ.లు, యెస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు