కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు
మిర్యాలగూడ. జనం సాక్షి
కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ను కళాశాల ప్రిన్సిపాల్ టి వెంకటరమణ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి వెంకటరమణ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్ ద్వారా ఆన్ లైన్ లో వివరాలను పొందుపర్చి తాము చదవాలనుకుంటున్న కళాశాల, గ్రూపును ఎంపిక చేసుకోవచ్చన్నారు తొలివిడత రిజిస్ట్రేషన్స్ ఈనెల 30 వ తారీఖు వరకు చేసుకోవచ్చని వెబ్ ఆప్షన్లు 30 వ తారీఖు వరకు ఇచ్చుకోవచ్చని,విద్యార్థులు తమ మొబైల్ కు వచ్చిన ఓటీపీ ,పిన్ నెంబర్ ను ఇతరులతో పంచుకోవద్దు అని సూచించారు . దోస్త్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అడ్మిషన్ కోసం ప్రయత్నించే క్రమంలో మీ సర్టిఫికెట్స్ ,ఆధార్ కార్డు ( విద్యార్డుల పేరు,తండ్రి పేరు ,పుట్టిన తేదీ , ఆధార్ కార్డు నంబర్ , ఆధార్ కార్డు ఫోటో,కులం,ఆదాయం సర్టిఫికెట్స్ ) లలో తప్పులు ఉన్నప్పుడు మా కళాశాల లో ఉన్న దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ కో- ఆర్డినేటర్ ఎన్ . కోటయ్య ను సంప్రదించి సలహాలు సూచనలు పొందడం తీసుకోవడం తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను చూపించి వెరిఫికేషన్ చేయించుకొని సమస్యలను పరిష్కరించుకో వలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దోస్త్ కో ఆర్డినేటర్ ఎన్ . కోటయ్య, కో ఆర్డినేటర్ సునంద, అకడమిక్ కో ఆర్డినేటర్ జె . నరేందర్ రెడ్డి,ఎన్ సీ సీ కేర్ టేకర్ రాచ మల్ల శ్రీను , ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్,రామిరెడ్డిసుధాకర్, డా.నరేష్,రమేష్,రమాదేవి,అనిల్, యాదమ్మ,యం . కరుణాకర్ రెడ్డి, . కట్టా కరుణాకర్ రెడ్డి,.కవిత,. కవిత ,చారీ ,తదితరులు పాల్గొన్నారు