కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం
మండల కేంద్రంలో శనివారం నాడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఘనంగా జరిపారు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకుంటారని పారిశుద్ధ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు అందరికీ సురక్షితమైన పరిశుభ్రమైన టాయిలెట్ల లభ్యతను అంతర్జాతీయ పారిశుధ్య సంక్షోభంపై దృష్టిని ఆకర్షించేందుకు ఈ దినోత్సవాన్ని పాటిస్తారు మరుగుదొడ్లను ఉపయోగించడం వలన ప్రజల ప్రాణాన్ని కాపాడడమే కాకుండా అనేక వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడతాయి పరిశుభ్రమైన నీటి హక్కు లాగే పారిశుద్ధ్య హక్కు కూడా మన మానవ హక్కు పారిశుధ్య లోపం వల్ల ప్రజల గౌరవం భద్రత మరియు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు కూడా అందకుండా పోతున్నాయి బహిరంగ విసర్జన వల్ల డయేరియా కలరా టైఫాయిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింప చేస్తుంది మరియు పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది బహిరంగ విసర్జన చేయడం వల్ల మీకు మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు హాని కలిగించడమే కాకుండా అనేక వ్యాధులను వ్యాప్తింపజేస్తుంది సంపూర్ణ స్వచ్ఛత కోసం పరుగు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛతరన్ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మరుగుదొడ్లు ఉపయోగిస్తే ఎన్నో వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు ప్రధానంగా మురుగునీరు గాని మరుగుదొడ్ల నుంచే వచ్చే వ్యర్ధాలుగాని బహిర్భూమి చేయడం వలన బయట నీళ్లు కలుషితం కావడం వల్ల రోగాలు వ్యాపిస్థాయి అని చెప్పారు ప్రతి మనిషి కూడా విధిగా మరుగుదొడ్డిని ఉపయోగించాలని మరుగుదొడ్డి ఉపయోగించడం వల్ల గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుంది మరుగుదొడ్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం 12 వేల రూపాయలు కూడా సహాయం చేస్తుంది మరుగుదొడ్లు లేని వారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి స్వచ్ఛత రన్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల ఎంపీడీవో బాలరాజు రెడ్డి, ఎంపీఈఓ సిహెచ్ఎన్ రావు, పంచాయతీ కార్యదర్శి వీరబాబు, ఉప సర్పంచ్ గంధం సురేష్, వార్డు సభ్యులు కోడిదల వెంకటయ్య, బావండ్ల దుర్గయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ, కొర్ర లోక్య నాయక్, ఎబిలైజర్, నరసింహారావు, నల్లా నర్సింహ, జనార్దన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అక్కిరెడ్డి, నహీదా షమీం, సమ్రీన్, రమాదేవి, జగదీష్, నీరజ, అశోక్ కుమార్, కలమ్మ సముద్రాల శ్రీనయ్య, దేవకుమార్, చంద్రయ్య మరియు విద్యార్థిని విద్యార్థులు ప్రజాసంఘాలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు