కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు
కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనం సాక్షి : మండల కేంద్రంలోని కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు ప్రపంచవ్యాప్తంగా బాలికలపై ఉండే వివక్షతను, హింసను, బాల్య వివాహాల వల్ల నష్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు బాలికలు విద్యా, శారీరక, మానసిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలన్నారు బాలికలు ఉన్నత చదువులు చదివి ఉంటే ప్రపంచాన్ని జయించు అన్నారు తర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో బాలికలకు ఫ్యాడ్లు పెన్నులు బహుకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు అద్యక్ష్వహించడము జరిగినది బాలికలు బాగా చదుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు ఈ కార్యక్రమం లో సముద్రాల శ్రీనయ్య, కే వెంకటేశ్వర్లు, కొర్ర లోక్య నాయక్, సరస్వతి, కళమ్మ, నాగేంద్రమ్మ, జనార్దన్ రెడ్డి, పీజే నర్సింహా రావు, నల్ల నర్సింహా, శ్రీపతిరావు, అక్కిరెడ్డి సూర్య సీతారాం తదితరులు పాల్గొన్నారు