కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ

పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడం జరిగిందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల మండల స్థాయి జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయిలో చెకుముకి సైన్స్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు చెకుముకి సైన్స్  సంబరాలు క్విజ్ పోటీలు విద్యార్థిని విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ పరీక్షలలో 8 9 10 తరగతి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర అంశాలలో బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయని తెలిపారు వివిధ పాఠశాలల విజేతలు అందరూ మండల స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు మండల స్థాయిలోని విజేతలకు జిల్లా స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారు జిల్లా స్థాయిలోని విజేతలు అందరికీ రాష్ట్రస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఆనందాన్ని మనోవికాసాన్ని ఇచ్చే చెకుముకి సైన్స్ పరీక్ష విజ్ఞాన శాస్త్రం పై ఆసక్తి కలిగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో  ప్రోగ్రామ్ ఇన్చార్జి నల్లా నరసింహ, సైన్స్ ఉపాధ్యాయులు సముద్రాల శ్రీనయ్య, కలమ్మ, జనార్ధన్ రెడ్డి, అశోక్ కుమార్, దేవకుమర్, చంద్రయ్య, కొర్ర లోక్య నాయక్, నీరజా, జగదీష్, సైదనాయక్, అక్కిరెడ్డి, నరసింహారావుతదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు