కొండమల్లేపల్లి పట్టణంలో ఏఐటీయూసీ 103వ వ్యవస్థాపక దినోత్సవం
కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : ఏఐటీయూసీ 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొండమల్లేపల్లి మార్కెట్ హమాలి కార్మికుల సంఘం జెండాను హమాలి కార్మిక గౌరవ అధ్యక్షులు రామావత్ బాలు ఎగురవేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి అనంతరం మాట్లాడుతూ ఏఐటిసి 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో స్థాపించడం జరిగిందని ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికుల హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని స్వాతంథానికి పూర్వమే కార్మిక సంఘాల చట్టం ఫ్యాక్టరీల చట్టం పారస్రామిక వివాదాల చట్టం కనీస వేతనాల చట్టం తదితర హక్కులు ఏఐటిసి సాధించడం జరిగిందని బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యవాదుల నుండి విముక్తి చేయుట జరిగిన స్వాతంత్ర సంగ్రామం లో కార్మిక వర్గాన్ని సంగతితం చేసి వీరోచిత పోరాటాలు చేసిన దేశభక్తి గల కార్మిక సంఘం నాడు సామ్రాజ్యవాదం పెట్టుబడి చేతుల దారి చేతుల్లో నలిగిపోతున్న కార్మిక వర్గాల దిక్సూచిగా నిలిచి అనేక ఉద్యమాల ద్వారా కార్మిక చట్టాలను హక్కులను సాధించిన ఏకైక సంఘం ఏఐటిసి పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు కోట్ల కుదించి పెట్టుబడుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం రాబోవు రోజుల్లో మరింత ఉదృతమైన పోరాటాలు చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హమాలి నాయకులు రామావత్ బోడ, రామవత్ శంకర్, భీమ్లా నాయక్, ఎల్లయ్య, కృష్ణ,బాలు తదితరులు పాల్గొన్నారు