కొండమల్లేపల్లి పట్టణంలో వైభవంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్థగిరి క్షేత్రం లో శ్రీశ్రీశ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామివారి మంగళ శాసనములతో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ ఉత్సవాలను చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరలిరావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని భక్తి పారవశ్యంతో ఉండాలని ఈ బ్రహ్మోత్సవాలను ఎంతో పటిష్టంగా నిర్వహిస్తున్నామని భక్తులకు అన్ని సదుపాయాలు సమకూర్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తరించాలని కోరారు భక్తులకు వసతి భోజన సౌకర్యాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరములు: 13.11. 2022 ఆదివారం రోజున విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం మృత్సoగ్రహణం, అంకురార్పణ,అగ్ని ప్రతిష్ట, చతు:స్థానార్చన, ద్వారతో రుణ పూజ, మూల మంత్ర హోమము పూర్ణాహుతి ధ్వజారోహణము బలిహరణము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, మూల మంత్ర హోమము చతు: స్థానార్చన భేది పూజ దేవత ఆహ్వానము పూర్ణాహుతి బలిహరణము జరుగును 14.11.2022 సోమవారం నాడు ద్వారతోరణ పూజ మూల మంత్ర హోమము పూర్ణాహుతి బలిహరణము తీర్థ ప్రసాద వితరణ, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మూల మంత్ర హోమము చతుస్థానార్చన పూర్ణాహుతి బలిహరణము జరుగును 15.11. 2022 మంగళవారం నాడు నిత్య హోమం మూలమంత్ర హోమము ధ్వజ అవరోహణము బలిహరణము చతుస్తానార్చన ద్వారాతో రుణ పూజ మహా పూర్ణాహుతి చక్రతీర్దోత్సవం మహా కుంభ ప్రోక్షణ మరియు మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం, తీర్థ ప్రసాద గోష్టి, తిరువీధి ఉత్సవం ( గ్రామసేన ) జరుపబడునని ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు భక్తులు ప్రాతులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు