కొండమల్లేపల్లి పట్టణం వినాయక్ నగర్ లో శ్రీ లక్ష్మీ సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి డిసెంబర్ 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల వినాయక నగర్ లో సోమవారం నాడు వినాయక నగర దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో పాల గణపతి శర్మ, డేరం జయప్రకాష్ శర్మ మరియు ఇతర పురోహితుల సమక్షంలో సోమవారం నాడు ఘనంగా కార్యక్రమాలు జరిగాయని వినాయక నగర దేవస్థాన కమిటీ వారు తెలిపారు సోమవారం నుండి బుధవారం వరకు జరిగే మూడు రోజుల కార్యక్రమాలలో మొదటి రోజు సోమవారం నాడు శ్రీ విఘ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, మాతృకాపూజనం, నాందీ ముఖం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, సర్వతో భద్ర వాస్తు క్షేత్రపాల నవగ్రహ మంటప ఆవాహిత స్థాపన పూజలు, అగ్నిప్రతిష్ట, మహాగణపతి, మహాలక్ష్మీ, మహాసరస్వతి, ధ్వజ,జలాధివాసాలు,హోమాలు, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు జరిగాయని అనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరిగాయని వినాయక దేవస్థాన కమిటీ వారు తెలిపారు మరియు మంగళవారం బుధవారం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి స్థానిక సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి,జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ గంధం సురేష్, నీలా లక్ష్మయ్య,మాడుగుల యాదగిరి, బూడిద మల్లేష్ యాదవ్, లింగాల మధుసూదన్ రెడ్డి, కందుల వెంకట్ రెడ్డి, పాక లక్ష్మయ్య, వరికుప్పల శ్రీను, వరికుప్పల పాండు, తోటపల్లి కిరణ్, తోటపల్లి శ్రీను, మేదరి శ్రీను, సుధాకర్ రెడ్డి, తోటపల్లి నాని, జబ్బు అంజయ్య, మూడవత్ మంగ్యా నాయక్, పెద్దిశెట్టి మహేందర్, ఎండి ఖదీర్, సేవా నాయక్ మరియు పూజలలో పాల్గొనే దంపతులు భక్తులు పట్టణ వాస్తవ్యులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు