కొండమల్లేపల్లి లో నూతన ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయాన్ని ప్రారంభించిన
ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పాషా
కొండమల్లేపల్లి అక్టోబర్ 14 జనం సాక్షి :
సమాజంలోని ప్రతి ఒక్కరికి జాతీయ మానవ హక్కుల సంఘం
అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని జాతీయ మానవ హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పాషా అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి దేవరకొండ రోడ్ లో నూతనంగా ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయాన్ని కొండమల్లేపల్లి మండల శాఖ అధ్యక్షులు పెద్ది శెట్టి సత్యనారాయణ తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి హక్కులను పొందేటువంటి హక్కు ఉందని ఎన్ హెచ్ ఆర్ సి ద్వారా సమస్యలు పరిష్కరించుకొనడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయాన్ని ప్రారంభించిన కొండమల్లేపల్లి మండల శాఖను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు .ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని లిఖితపూర్వకంగా ఎన్ హెచ్ ఆర్ సి కి ఫిర్యాదు చేసినట్లయితే ఆయా శాఖలకు సంబంధిత శాఖ అధికారులకు వివరణ కోరుతూ సమస్యలను శాఖల ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు .ఒక తెల్ల పేపర్ పై ఫిర్యాదు అందిస్తే తాము పరిశీలించి తగు చర్యలు తీసుకోవడానికి ఉన్నత అధికారులకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎన్ హెచ్ ఆర్ సి దేవరకొండ నియోజకవర్గం సామాజిక సేవా విద్యా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల శాఖ అధ్యక్షుడు పెద్ది శెట్టి సత్యనారాయణ పట్టణ అధ్యక్షుడు వారిద్దీన్ సుభాని బొజ్జ నరేష్ తుకారాం రాజేష్ కైసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా సభ్యత్వం తీసుకున్న సురభి రమాదేవికి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునికి శాలువాతో ఘనంగా సన్మానించారు.