కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయల సాధన కోసం ప్రభుత్వం క్రుషి

మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు , జాయింట్ కలెక్టర్ పద్మాకర్
 జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 27)
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 103వ  జయంతి ఉత్సవాల సందర్బంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేట లోని బి.సి. స్టడీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సభకు ముఖ్య అతిధి గా మున్సిపల్ చైర్మెన్ కడవేర్గు రాజనర్సు  జాయింట్ కలెక్టర్ పద్మాకర్ తో కలిసి మాట్లాడుతూ చేనేత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా రాజకీయంగా , ఉద్యామాల పరంగా ఉన్నత శికారాలు అధిరోహించి మహాత్మా గాంధీ సమకాలికులు , అంతటి గొప్ప ఉద్యమ కారుడు ,  బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడి హక్కులను సాధించిన మహానుబావుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని అయన అన్నారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం అటు తొలి దశ , మలిదశ రెండు తరాలకు మార్గ నిర్దేశం చేసిన మాహానుభావుడు బాపూజీ అని అన్నారు , గతంలో ఎవ్వరు కూడా  బి.సిలను పట్టించుకున్న దఖలాలు లేవని వారు అన్నారు . వారి ఆశయ సాధనలో బాగంగా ప్రభుత్వం నేడు అయన  జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాదని ,బి.సి. స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేసి ఉపాది అవకాశాల దిశగా పయనించటం జరిగిందని అన్నారు , బి.సి గురుకులాలు ఏర్పాటు చేసి విద్యాభివృద్దికి కృషి చేస్తున్నదని అన్నారు . మంత్రి హరీష్ రావు కృషితో సిద్దిపేట లో అదునాతన ధోభి ఘాట్ ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు , బి.సిలకు సబ్సిడీ రుణాలు అందించి ఆర్ధిక ఎదుగుదలకు కృషి చేస్తున్నాదని అన్నారు.జాయింట్ కలెక్టర్ పద్మాకర్  మాట్లాడుతూ ఒక న్యాయ వాదిగా , క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కారునిగా , తెలుగు ,హిందీ ,ఉర్దూ, మారాటి ,ఆంగ్ల బాషల్లో సైతం అనర్గళంగా మాట్లడే వాక్చాతుర్యం కల బహు బాష కోవిదుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు ఈ దేశంలో స్వేచ్చ స్వాతంత్ర్యాలు విరాజిల్లు తున్నయంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారు చేసిన తీగా ఫలితమేనని అలంటి మహానుభావులను  యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు , ఆదిలాబాద్ లో జన్మించి నల్గొండలోశాసన సభ్యుడిగా గెలిచి ప్రజలకు సేవలందించారని జాయింట్ కలెక్టర్ అన్నారు .
 ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల  కోఆర్డినేటర్ బుర విజయ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ , పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు మల్లేశం , డా.సతీష్, , డి.బి.సి.డి.ఓ సరోజ , డి.ఎస్.ఓ వెంకటేశ్వర్లు ,ఎస్.సి. కార్పోరేషన్ జిల్లా అధికారి చరణ్ దాస్  తదితరులు మాట్లాడగా సూపరిండెంట్ నర్సింలు , బి.సి. స్టడీ సర్కిల్ డిరెక్టర్ రాములు , శ్రీనివాస్,  గుండు రవి తేజ , మరియు వివిధ సంఘాల ప్రతినిధులు , విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు .

తాజావార్తలు