కొత్తకోటలో ముగింపు దశలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 15వ వార్డులో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి వార్డులోనీ ప్రతి కాలనీని శుభ్రం చేయడం జరిగిందనీ వార్డు కౌన్సిలర్ ఖాజా మైనోద్ధిన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచన మేరకు,వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాష ఆదేశాల మేరకు గత 15 రోజులుగా మున్సిపాలిటీ 15వ వార్డులో ప్రతి దినం పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి వార్థును శుభ్రం చేయడం జరిగిందనీ చెప్పారు.ప్రస్తుత వర్షాకాలం కంటే ముందు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించి రాబోయే సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడడానికి ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల మున్సిపల్ కౌన్సిలర్ ఖాజమైనద్దిన్ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన వనపర్తి జిల్లా కలెక్టర్ కు శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా కొత్తకోట మున్సిపాలిటీ 15వ వార్డులో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేశిని విశ్వేశ్వర్,కమిషనర్ వెంకటేశ్వర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.