కొత్తగా వచ్చేవారికి అవకాశం ఇవ్వలేం : కేసీఆర్‌

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీలోకి అన్ని రాజకీయ పార్టీల వారిని చేర్చుకునే ప్రసక్తిలేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఆధినేత కేసీఆర్‌ తెలిపారు. ఇంతకాలం పార్టీకోసం పోరాడినవారిని కాదని కొత్తవారికి అవకాశాలు ఇవ్వలేమని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరినిక్షుణ్ణంగా పరిశీలించి ఉద్యమానికి ఉపయోగపడేవారిని మాత్రమే పార్టీలోకి చేర్చుకుంటామని ఆయన అన్నారు.జగ్గారెడ్డి గురించి మాట్లాడి నన్ను నేను దిగజార్చుకోలేను అని ఓ ప్రశ్నకు కేసీఆర్‌ సమాధానమిచ్చారు.