కొత్తగూడెంలో భారీ అగ్ని ప్రమాదం
ఖమ్మం: కొత్తగూడెం సింగరేణి ఎక్స్‌ప్లోజివ్స్ గోడౌన్ సమీపంలోని జామాయిల్ తోటలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో జామాయిల్ చెట్లు తగలబడిపోతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.