కొత్తఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంతో పేదవిద్యార్థులు చదువుకు దూరం:బాబు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయటంతో పేదవిద్యార్థులకు చదువు దూరమవుతుందని టీడీపీ అధినేత చంత్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులపై  ప్రభుత్వం మరింత భారం మోపుతుందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.31వేల సీలింగ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను టీడీపీ హయంలోనే అమలు చేశామని గుర్తు చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ స్కీమ్‌లు ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.