కొత్త జిల్లాల ఫలితాలు వస్తున్నాయి
జనగామ,అక్టోబర్18(జనంసాక్షి): పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఏడాది కాలంగా ఇప్పుడవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. జిల్లాల ఏర్పాటుతో జనగామ అభివృద్దికి అవకాశం ఏర్పడిందని అన్నారు. మండల, గ్రావిూణ స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేలా పనిచేసి ప్రజలకు చేరువ కావాలని ఆయన కోరారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేలా చేయాలన్నారు. గ్రావిూణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, తదితర రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అధికారులు అంకితభావంతో పనిచేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల ఏర్పాటు లక్ష్యం పాలన వికేంద్రీకరణ అన్నారు. అన్ని జిల్లాలను అభివృద్ధిలో ప్రథమస్థానంలో నిలిపేందుకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. చిన్న జిల్లాల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్షరాస్యత పెంచేందుకు కృషి చేయాలన్నారు.