కొత్త పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జనం సాక్షి: నర్సంపేట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంజూరు చేసిన 10 లక్షల నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12 వేల మందికి ఆసరా పింఛన్లు మంజూరు కాగా.. నేడు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు చెందిన మొత్తం 1148 ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను, ధ్రువ పత్రాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ
ప్రభుత్వంచే విడుదలై లబ్ధిదారుల చేతులకు నేరుగా ఆసరా పెన్షన్లను అందించారు.
మొట్టమొదటి సారి పెన్షన్ ఆదుకోవడంలో ఉండే సంతోషం అంతా, ఇంతా కాదు.మొదటిసారిగా రూ. 2016, 3016 పెన్షన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులకు  శుభాకాంక్షలు తెలిపారు.
ఆసరా పెన్షన్ల మంజూరుకై వయోపరిమితి విషయంలో కేవలం ఓటర్ కార్డును మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది.ఇంకా పలు కారణాల వల్ల పెన్షన్ కార్డులు రాని అర్హత ఉన్నవారు మళ్లీ మాన్యువల్ గా ఆఫ్ లైన్ ద్వారా మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.వాటిని పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించి కొత్త కార్డులను ఇచ్చే బాధ్యత నాదే అన్నారు. కేంద్రాన్ని పాలించే ప్రభుత్వమైనా బిజెపి రాజకీయ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సంక్షేమ పథకాలను ఇవ్వొద్దు అని సుప్రీం కోర్టును రాతపూర్వకంగా ఆశ్రయించిన దుస్థితి నేడు ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రానికి రావాలిసిన హక్కులను నేడు కాలరాసే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తోంది.రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా తీవ్రత వల్ల ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా ఇటీవల 10 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేసిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
దసరా పండుగ అనంతరం మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారిగా సభలు నిర్వహించి స్వంత స్థలం ఉన్నవారికి ఎవరి స్థలంలో వారే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షలను మంజూరు చేపిస్తామన్నారు.
అలాగే గతంలో డబుల్ బెడ్ రూమ్  దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లను కూడా పరిశీలన చేసి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉందని తెలియచేస్తున్నాను.
అదేవిధంగా నర్సంపేట పట్టణ అభివృద్ధిలో భాగంగా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన రూ.50 కోట్ల పనులకు సంబంధించిన అనుమతులు త్వరలో రాబోతున్నాయి.ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా త్వరలో అభివృద్ధి చేసి మీకు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ పట్టణ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు, క్లస్టర్ భాద్యులు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area