కొత్త సీఎస్‌గా పీకే మహంతి నియామకం

హైదరాబాద్‌ : ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్‌ మహంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీకే మహంతి మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ మిన్నీ మ్యాధ్యూ నేడు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన పీకే మహంతి 1979 వ బ్యాచ్‌కు చెందిన భారత ప్రభుత్వంలో అడిషనల్‌ సెక్రటరీ నుంచి స్పెషల్‌ సెక్రటరీ పదొన్నత పొందారు.