కొత్వాల్ గుడ, బహదూర్ గుడ, ఘాన్సిమియ గుడలో భూములు కొనుగోలు చేసేవారు పూర్తిస్థాయిలో తెలుసుకొని కొనాలి- శంషాబాద్ తహసీల్దార్ జనార్ధన్ రావు.
*తొందరపడి కొని నష్టపోవద్దు – శంషాబాద్ తహసీల్దార్ జనార్ధన్ రావు*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : కొత్వాల్ గూడ,బహాదుర్ గుడ,ఘాన్సిమియ గుడ గ్రామాలలో భూములు కొనుగోలు చేసేవారు పూర్తిస్థాయిలో విచారించుకొని కొనుగోలు చేయాలని శంషాబాద్ తహసిల్దార్ జనార్దన్ రావు అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహాదుర్ గుడలో సర్వే నెంబర్ 28 లో 150 ఎకరాలు,సర్వే నెంబర్ 62 లో 500 ఎలరాల భూమి ప్రభుత్వ భూమిగా పరిగణిస్తుందని ఇప్పటికే భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరిగిందన్నారు. కొత్వాల్ గూడ గ్రామంలోని దాదాపు 2000 ఎకరాలకు పైగా భూమి ఎనిమి ప్రాపర్టీలో ఉండడంతో ఆ భూములను కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరిగిందన్నారు.ఘాన్సిమియ గుడలోని భూములు సిఎస్7-సిఎస్14 లలో కోర్టు కేసులు ఉండడంతో ప్రభుత్వం తన భూమిగా పరిగణిస్తుందని మరియు ఓ ప్రైవేట్ కంపెనీ కూడా తన భూమిగా పరిగణిస్తూ కోర్టులో కేసులో నడుస్తున్నాయి అన్నారు. ఈ భూమిలో కూడా రిజిస్ట్రేషన్ నిలిపివేశామన్నారు.
ఈ మూడు గ్రామాలలో ఉన్న భూములకు సంబంధించి క్రయవిక్రయాలు నిలిపివేయడం జరిగిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కొనుగోలు చేసేటప్పుడు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసుకోవాలన్నారు. ఒకవేళ నోటరీ చేసుకున్న అది చెల్లదని ఈ భూములను అమ్మిన కొన్న కేసులు నమోదు చేస్తామన్నారు.ఏ విధంగా కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్లు కావని అనవసరంగా కొన్ని నష్టపోతున్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ తహసిల్దార్ జనార్దన్ రావు.