కొద్దిసేపట్లో దుండగులు ఎవరో తేలనుంది

కొద్దిసేపట్లో దుండగులు ఎవరో తేలనుంది

నల్గొండ:  నల్గొండ జిల్లా  మోత్కూరు మండలం  జానకీపురం శివారులో శనివారం ఉదయం  జరిగిన ఎదురు కాల్పుల సంఘటనా స్థలానికి మధ్య ప్రదేశ్ పోలీసులు వచ్చారు. ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్ వేలిముద్రలను వారు తీసుకువచ్చారు. నార్కెట్పల్లిలోని కామినేని ఆస్పత్రిలో తీవ్రవాదుల మృతదేహాలను ఆ పో్లీసులు పరిశీలిస్తారు. వారు ఎవరో ఆధారలతోసహా నిర్ధారిస్తారు.

నల్గొండ జిల్లాలో కాల్పులకు పాల్పడింది సిమి ఉగ్రవాదులేనని ఇంటిలిజెన్స్ వర్గాలు,  కేంద్ర హొం శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్గా నిర్ధారించారు. యూపీకి చెందిన ఈ ఇద్దరూ ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా ఉన్నారు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. వీరు 2007లో కేరళలో తీవ్రవాద శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 2010లో భో్పాల్లోని ఓ బంగారు దుకాణంలో వీరు చోరీ చేసినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు చోరీకి పాల్పడింది కూడా వీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు.