కొనసాగుతున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు

సిద్ధిపేట: మెదక్ జిల్లా సిద్ది పేట మున్సిపాలిటీ కి సంబంధించి 28 వార్డులకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 34 వార్డులకు గాను 6 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 72 కేంద్రాల్లో 74, 710 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రభుత్వం 8 మంది జోనల్ అధికారులను, 8 రూట్లుగా విభజించి నియమించింది. పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ విధానం అమర్చారు. దీని ద్వారా ప్రతి క్షణం పోలింగ్ ప్రక్రియను వీడియా ద్వారా చిత్రికరించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.