కొమరం భీమ్ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్
వనపర్తి అక్టోబర్ 22 (జనం సాక్షి)కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ పోరాట స్ఫూర్తిని ప్రజా సమస్యల పరిష్కారంలో కొనసాగిద్దామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ పిలుపునిచ్చారు శనివారం భగత్ సింగ్ నగర్ లో కొమరం భీమ్ 121 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గ కరిమేర మండలంలో జన్మించారన్నారు హైదరాబాద్ నిజాం చట్టాలను ధిక్కరించి గిరిజన రాజ్యం కోసం గిరిజనులు విముక్తి కోసం 19 28 నుంచి 1940 వరకు కొమరం భీమ్ మడిమ తిప్పని గెరిల్ల పోరాటాన్ని నడిపారన్నారు తుపాకులను స్వాధీనం చేసుకున్నారన్నారు 12 గ్రామాలు ఆయన స్వాధీనంలోకి వచ్చాయన్నారు నిజాం కంటికి కునుకు లేకుండా చేశారన్నారు ఆయనతో సంధికి నిజాం చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు కొమరం భీమ్ ను చంపాలని నిజాం సైన్యాలను పంపాడ న్నారు 12 గ్రామాల చుట్టుపక్కల పొలిమేరలో కొమరం భీం సైన్యం మోహరించి నిజాం సైన్యాలను ముందుకు సాగకుండా అడ్డుకుందన్నారు ఇక ఆయనను ప్రత్యక్షంగా ఎదుర్కోవటం అసాధ్యమని భావించి ఆయన ఆనుపానులు తెలిసిన ఒకరిని మచ్చిక చేసుకుని చేసుకొని జోడేఘాట్లో ఆయన ఉంటున్న రహస్య ప్రదేశాన్ని కనిపెట్టారన్నారు అతను కొమరం భీముని చూపించడం తో సైన్యం కాపులు జరిపిందన్నారు అక్టోబర్ 8వ తేదీన 1940లో అమరుడయ్యారన్నారు అయితే మరణం పై భిన్న తేదీలు ప్రచారంలో ఉన్నాయన్నారు సెప్టెంబర్ ఒకటవ మరణించాడని పాఠ్యపుస్తకాల్లో పేర్కొన్నారు అక్టోబర్ 8న మరణించాడని ఆరోజు కొందరు వర్ధంతి చేస్తారన్నారు కొందరు అక్టోబర్ 27వ తేదీన సైనిక కాల్పుల్లో మరణించినట్లు ఆన్లైన్లో ఉందన్నారు అక్టోబర్ 10న కొమరం భీం అమరుడయ్యారని ఆదివాసీలు భావిస్తార న్నారు అందువల్ల అదే రోజు జోడేఘాట్లో ఆదివాసీలు ఆయన వర్ధంతి వేడుకలను పెద్ద ఎత్తున జరుపుతారు అన్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అదే రోజు నిర్వహిస్తుందన్నారు తెలంగాణ నుంచే గాక పరిసర మహారాష్ట్ర తదితర నుంచి ఆదివాసీలు అసంఖ్యాకంగా తరలివస్తారన్నారు ఆయన మరణం వేర్వేరు తేదీలు ప్రచారంలో ఉన్నందున లోతైన పరిశోధన జరగాలన్నారు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో పేర్కొన్నట్లు మరణం సెప్టెంబర్ 1వ తేదీన అయితే అదే రోజు వర్ధంతి జరపాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ పి కళావతమ్మ రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశీ ,మనుసాగర్ ,మహిళా నాయకులు జయమ్మ, వెంకటమ్మ పద్మ దితరులు పాల్గొని నివాళులర్పించారు
Attachments area
|