కొలువుదీరిన కన్నడ మంత్రులు

20 మంది కేబినెట్‌, 8 మందికి సహాయ హోదా
బెంగళూరు, మే18 (జనంసాక్షి) :
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువుతీరింది. రాజ్‌భవన్‌లో 28 మంది మంత్రులతో గవర్నర్‌ హెచ్‌.ఎం. భరద్వాజ్‌ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో 20 మంది కేబినెట్‌ మంత్రులు, 8 మంది సహాయక మంత్రులు ఉన్నారు. అవినీతి ఆరోపణలు, గనుల కుంభకోణాల్లో ప్రమేయం ఉన్నవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. రెబెల్‌ స్టార్‌ అంబరీష్‌కు చోటు లభించడం విశేషం. శనివారం సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుక్తున్నారు. అధిష్టానం ఆమోదంతో ఈ కూర్పు జరిగింది.  మంత్రివర్గంలో పాతవారితో పాటు కొత్తవారికి కూడా చోటు లభించింది. పది మంది కొత్తవారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్‌వీ దేశ్‌పాండే, అంబరీష్‌, కృష్ణ బైర్‌ గౌడ లాంటి సీనియర్లకు సిద్ధరామయ్య తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఒక్క మహిళాకు మాత్రమే  మంత్రివర్గంలో చోటు కల్పించారు. నటి ఉమాశ్రీకి మంత్రివర్గంలో మంత్రివర్గంలో చోటు దక్కింది. డికె శివకుమార్‌కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గంలో చేరినవారిలో  రామలింగారెడ్డి, ఆర్‌వి దేశ్‌పాండే, ప్రకాష్‌ హుక్కేరి చిక్కోడి, సామనూరు శివశంకరప్ప, ఏకె పాటిల్‌, జయచంద్ర, ఖమరూల్‌ ఇస్లాం, రామనాథ్‌ రాయ్‌, మహదేవప్ప, అంబరీష్‌, బాబూరావు, కెజె జార్జ్‌, హెచ్‌ ఆంజనేయ, యాటీ కదీర్‌, ఎంబి పాటిల్‌, తంగడదడి, దినేష్‌ గుండూరావు, ఆభిరాయ్‌ గౌడ, అభయ్‌ చంద్ర జైన్‌, రత్నాకర్‌, ఉమాశ్రీ, సంతోష్‌ , సతీష్‌ జరకి¬ళి, పరమేశ్వర్‌ నాయక్‌, వినయ్‌ కుమార్‌, వి. శ్రీనివాస ప్రసాద్‌, శరన్‌ ప్రకాష్‌ పాటిల్య సిద్ధరామయ్య ఈ నెల 13వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ కూర్పుపై చర్చించడానికి సిద్ధరామయ్య ఈ వారాంభంలో ఢిల్లీ వెళ్లారు. స్థిరమైన, సమర్థమైన ప్రభుత్వాన్ని అందిస్తానని సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చెప్పారు.ఇదిలావుంటే మంత్రివర్గంలో అప్పుడే అలకలు మొదలయ్యాయి.  నూతన మంత్రివర్గం ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అసంతృప్త నేతల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్‌ నేత అనీల్‌లాడ్‌ ప్రకటించారు. గనుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనీల్‌లాడ్‌, డీకే శివకుమార్‌లకు మంత్రివర్గంలో సీఎం స్థానం కల్పించలేదు.
వహించాల్సి ఉంటుందన్నారు.