కొలువుల జాతర

5

– తెలంగాణ సర్కారు తొలి ఉద్యోగ ప్రకటన

హైదరాబాద్‌,మే 2 (జనంసాక్షి):

తెలంగాణలో ఉద్యోగ జాతరకు టిఆర్‌ఎస్‌ సర్కార్‌ తెరలేపింది. తొలిసారిగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిసన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది.  పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. 418 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్‌  ఇంజినీర్ల నియామకాలకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.వాటర్‌ గ్రిడ్‌ పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 418 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, 125అసిస్టెంట్‌ ఇంజినీర్లను రిక్రూట్‌ చేయనున్నారు. ఇంతకాలం ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనతో ప్రభుత్వం తొలివిడతగా ఈ ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభించింది. ఇది ఆరంభం మాత్రమేనని, సిఎం కెసిఆర్‌ చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతందన్నారు.