కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ K. సతీష్ కుమార్

అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్న అని ప్రగల్బాలు పలికిన సోకాల్డ్ ఆణిముత్యం మంజూరైన పనులు ఎందుకు పూర్తి చేయలేదు…*_
_*💥గత నాలుగేళ్లుగా మంజూరై మొదలెట్టని పూర్తి కానీ పనుల పై GO లతో సహా మాజీ మంత్రి జూపల్లి ప్రెస్ మీట్…*_
_◆నియోజకవర్గ అభివృద్ధి కొరకు తాను మంత్రిగా ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శాంక్షన్ చేయించిన పనులు ముందస్తు ఎన్నికల మూలంగా పెండింగ్ లో ఉండి నాలుగేళ్లు గడుస్తున్న వాటికి టెండర్లు పిలవకుండా పనులు ప్రారంభించకుండా అభివృద్ధి కొరకే పార్టీ మారుతున్నానని ప్రగల్బాలు పలికిన నియోజకవర్గ ఎమ్మెల్యే సోకాల్డ్ ఆణిముత్యం ఎందుకు మొదలెట్టలేకపోయారని మాజీ మంత్రి వర్యులు *జూపల్లి కృష్ణారావు* గారు ధ్వజమెత్తారు గురువారం కొల్లాపూర్ పట్టణంలోని జూపల్లి గారి క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు పట్టణ కౌన్సిలర్ లు ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు…_
_◆నియోజకవర్గంలో తాను ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజల కేంద్రబిందువుగా వారి ఆకాంక్షల మేరకే నిర్ణయాలు తీసుకున్నానని ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడలేదని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేదని గుర్తు చేశారు ఎన్నికల ముందు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి నాలుగేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారని జూపల్లి గారు స్పష్టం చేశారు మాటలు కోటలు దాటుతున్న నిధులు మాత్రం కొల్లాపూర్ కు రావట్లేదని నేను నిర్దిష్టంగా అడుగుతున్న శాంక్షన్ అయిన పనులు ఎందుకు మొదలెడుతలేవని జూపల్లి గారు ప్రశ్నించారు…_
_◆100 పడకల ఆసుపత్రి సకాలంలో పూర్తయి ప్రజలకు అందుబాటులో ఉండి ఉంటే కరోనాకాలంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా పరిస్థితి ఉండే కదా మూడు కోట్ల రూపాయలతో బండాయ గుట్ట దగ్గర కళ్యాణమండపం సాంక్షన్ చేయిస్తే పునాదికే పరిమితమై పోయిందని 12 బీసీ ఉపకులాలకు కమ్యూనిటీ హాల్స్ రెండు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తే వాటికి మోక్షం లేదని కోటి రూపాయలతో కూరగాయలు మరియు మటన్ మార్కెట్ మంజూరు చేస్తే దాన్ని పక్కన పెట్టారని కోటి రూపాయలతో మహానీయుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరుతో ఆడిటోరియం మంజూరు చేయిస్తే దానికి మోక్షం లేదని కోటి రూపాయలతో షాది ఖానా మంజూరు అయిన దాన్ని తాత్సరం చేస్తున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 400 వందల కోట్ల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేస్తే 50 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేయించారని మినీ స్టేడియంలో పిల్లలు యువత కోసం రెండు కోట్లతో సిమ్మింగ్ పూల్ మంజూరు చేస్తే అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందనే చందంగా తయారయ్యిందని జూపల్లి గారు దుయ్యబట్టారు…_
_◆ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్న నాలుగు సంవత్సరాల కింద మంజూరైన వాటికి మోక్షం లేదు చేసిన వాళ్లకు బిల్లులులేవు కొత్తగా ఎన్నికల కోసం ఏమైనా కొత్తగా వచ్చిన కాగితాలకే పరిమితం అని నియోజకవర్గ ప్రజలు గమనించాలని పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని జూపల్లి గారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మండల ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు పట్టణ కౌన్సిలర్లు జూపల్లి గారి ప్రధాన అనుచరులు నాయకులు తదితరులు ఉన్నారు…_