కొల్లాపూర్ లో కేటీఆర్ సభకు ముందే కోడేరు లో బిజెపి నేతల అరెస్టు.
కోడేరు (జనం సాక్షి) జూన్ 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రానికి శనివారం రోజు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కు తెలంగాణ రాష్ట్ర
పురపాలక మరియు ఐటీ శాఖామంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా కేటీఆర్ పర్యటనకు ముందే కోడేరు మండల కేంద్రము లో బీజేపీ నేతల ను పోలీసులు అరెస్టు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కి చెందిన కార్యకర్తలను అరెస్టు లు చేయడం మంచి పద్ధతి కాదని భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు
మూడావత్ నర్సింహా నాయక్, నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు రాత్లావత్ నరసింహ నాయక్ తీవ్రంగా ఖండించారు.
