కొళ్లకుంటలో రెండో రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీ కోసం ‘ పాదయాత్ర రెండో రోజు ప్రారంభమైంది. జిల్లాలోని కొళ్లకుంటలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరాగ చంద్రబాబు పాదయాత్రగా బయలుదేరారు.  నేడు 18 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది, కోళ్లకుంట నుంచి ప్రారంభమైన యాత్ర మధ్యాహ్నం చాలకూరుకు చేరుకుంటుంది, అక్కడ భో.న విరామం తీసుకోనున్నారు. రాత్రికి సోమందేపల్లిలో చంద్రబాబు బస చేయనున్నారు.