కోడేరులో ఘనంగా బీపీ మండల్ 105వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన పలువురు బిసీ నాయకులు.

కోడేరు జనం సాక్షి ఆగస్టు 25 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర బీసీల ఆరాధ్య దైవమైన బీపీ మండల్ 105వ జయంతి వేడుకలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వివిధ ప్రజాప్రతినిధులు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ బీసీల బతుకుల్లో రిజర్వేషన్ అమలు విషయంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి బీపీ మండల్ అని ఈ సందర్భంగా కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీల ప్రజలకు ఒక ఆరాధ్య దైవంగా బీపీ మండల్ నిలిచారని వాళ్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తదనంతరం బడుగు బలహీన వర్గాల కు సమాన హక్కులు కావాలని బీసీల రిజర్వేషన్లపై పోరాడిన మహనీయుడు బీపీ మండల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో యాపట్ల శేఖర్, నాగశేషి, కండక్టర్ కాజా ఎం కృష్ణయ్య తిరుపతయ్య యాదవ్ రాజు నరేంద్ర గౌడ్, రామకృష్ణ, స్వామి కుమార స్వామి, గ్రామ పెద్దలు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.