కోడేరు మండల కేంద్రంలో వీర యోధురాలు ఐలమ్మకు ఘన నివాళ్ళు.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలోని బస్టాండు చౌరస్తా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్తూపం దగ్గర  శనివారం రోజున తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ  37వ వర్ధంతి కార్యక్రమాన్ని కోడేరు స్థానిక బస్టాండ్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు దాసరాజుల రవి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మరియు బహుజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (BSJAC) నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆది సోమనాథ్ పాల్గొని మాట్లాడడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాటం చేసిన వీర వనిత అని భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకురాలు ఐలమ్మ అని. భూస్వామి పెత్తందార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరవనిత ఐలమ్మ. అనిఅంతటి గొప్ప మహా నాయకురాలి ఆశయాలను ప్రజల లోపలికి తీసుకుపోవడమే మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు.
  ఇట్టి  తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత ఐలమ్మ 37వ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తుమ్మల బాలపీరు, పోడేండ్ల చంద్రయ్య, సోప్పరి రామకృష్ణ, మరియు సిపిఎం పార్టీ నాయకులు రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చామంతి రాజు, కోడేరు జడ్.పి.హెచ్.ఎస్  స్కూల్ చైర్మన్ మేడిమాకుల శేఖర్. మరియు రజక వృత్తిదారుల సంఘం మండల కార్యదర్శి పెద్ద రాములు, కోడేరు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీను, సుజాత మరియు మండల ప్రజలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వీర యోధురాలు ఐలమ్మ కి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.