కోతకు గురైన కల్వర్టు ని సందర్శించిన, మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ


జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 11 నవంబర్ 2022 పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు
డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం మరియు వంగూర్ మండలం గ్రామాలైన ఉల్పారా, మొల్గర గ్రామాల మధ్యల దుందిబి వాగు పై నిర్మించిన కాజువె కోతకు గురైందని ఇరు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇక్కడ వచ్చి ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకోలేదు. ఈ వంతెన మీద ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఒక వెహికిల్ కూడాకొట్టుకుపోవడం జరిగింది .ఇంత సంఘటన జరిగిన ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి జరిగిన సంఘటన గురించి కూడా తెలుసుకోకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వంతెన గురించి గతంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నపించిన వారిలో చలనం రావడం లేదు. వెంబడే ఈ వంతెనను తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలి.
హై లెవెల్ వంతెన శాంగ్షన్ చేసి వెంబడే పనులు చెప్పటలి.
అక్కడ చనిపోయినటువంటి రైతులకు వెంబడే నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి ,నర్సింహా రావు,గోవర్ధన్ రెడ్డి,నర్సింహారెడ్డి, వెంకటయ్య,నరేష్ యాదవ్,తిరుపతయ్య గౌడ్,మోగిలి మహేష్,శేఖర్ గౌడ్,శుభాష్ రెడ్డి మరియు తిరుపతయ్యా యాదవ్,శ్రీరాములు యాదవ్,జగన్,పుట్ట శేఖర్,నాగరాజు గౌడ్,రేణయ్య యాదవ్,రేణయ్య,మొల్గార రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యువజన కాంగ్రెస్, NSUI నాయకులు పాల్గొన్నారు