కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ అరెస్టు
హైదరాబాద్ : చలో అసెంబ్లీకి బయలుదేరిన తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం, టీఎన్టీవోనేత శ్రీనివాస్‌గౌడ్‌ను అశోక్‌నగర్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌లు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఐకాస కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈసందర్భంగా కోదండరాం మాట్లాడుతూ…. ప్రజాస్వాయ్యం పద్దతిలో నిరసనతెలుపుతున్న తమపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా నైతికంగా తెలంగాణ ప్రజలే విజయం సాధించారని కోదండరాం వ్యాఖానించారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఉద్యమం కొనసాగుతుందని, ఈ రోజు సాయంత్రానికి ఉద్యమ కార్యచరణ ప్రకటించనున్నట్లు కోదండరాం చెప్పారు.