*కోదాడలో అంబరాన్ని అంటిన వజ్రోత్సవ సంబరాలు*
కోదాడ,ఆగస్టు13(జనం సాక్షి)
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు శనివారం కోదాడ పట్టణంలో కనుల పండుగగా జరిగాయి. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుండి ర్యాలీని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జండా ఊపి ప్రారంభించారు. ప్రధాన రహదారిపై విద్యార్థులు జండాలు, ప్లకార్డులు పట్టుకుని దేశభక్తి గీతాలు పాడుకుంటూ జై భారత్ అంటూ నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, ఆర్డీవో కిషోర్ కుమార్ ,డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి, కమిషనర్ మహేశ్వరరెడ్డి కేశినేని శ్రీదేవి. ఎస్ఆర్ఎమ్ స్కూల్ ఛైర్మెన్ లు మాట్లాడుతూ భావితరాల వారు ఇదే స్ఫూర్తితో భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని మరువకుండా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మహనీయుల జీవిత విశేషాలను భావితారాలకు తెలియజేసేలా వజ్రోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. ప్రధానంగా పట్టణంలోని ఎస్ఆర్ఎం స్కూల్ విద్యార్థులు పరేడ్ నిర్వహించి స్కేటింగ్ చేస్తూ ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అనంతరం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆకాశంలోకి మూడు రంగుల బెలూన్లను వదిలారు .ఈ కార్యక్రమంలో,ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, చందూ నాగేశ్వరావు ఎంఈఓ సలీం షరీఫ్, సీఐ శివ శంకర్, ఎస్సై నాగభూషణం, ఎస్సార్ ఎం స్కూల్ చైర్మన్, బాగ్దాద్ మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.