కోనేరులో పడి బాలుడు మృతి
సిద్దిపేట,మే4(జనం సాక్షి ): శివాలయం కోనేరులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొండపాక మండలంలోని కుకునూరుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య కుటుంబం పెద్దమ్మగుడిలో జరిగే ఉత్సవాలకు వచ్చారు. అక్కడి నుంచి శివాలయానికి దర్శనం కోసం వెళ్లారు. కనకయ్య, లక్ష్మీల కుమారుడైన జాప రాజు (9) స్నానానికి వెళ్లి అందులో మునిగిపోయాడు. బయటకు తీసేలోపే మృతి చెందాడు.